ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్న డీకే.అరుణ

తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న అతి కొద్ది మంది ప్రజాకర్షక కాంగ్రెస్ నేతలలో మాజీ మంత్రి, గద్వాల్ ఎమెల్యే డీ.కే. అరుణ ఒకరు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆమెకు ఉన్న పట్టు గురుంచి కొత్తగా చెప్పాల్సింది లేదు. ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలుగా ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో డీకే అరుణ గద్వాల్ ను జిల్లాగా చేయాలని పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన అర్హతలు అన్ని గద్వాల్ కు ఉన్నాయని ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గద్వాల్ పేరు ప్రభుత్వానికి ఇష్టం లేకుంటే తెలంగాణాలో ఏకైక శక్తి పీఠం జోగులాంబ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply