అందుకే వ్యక్తిగత విమర్శలు..

తెలంగాణ కాంగ్రెస్ నేత, గద్వాల్ ఎమెల్యే డీకే అరుణ మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్ పై మండిపడ్డారు. ఫిరాయింపులను మొదలు పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతమాత్రం కాదని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోపించినట్లుగా తెరాస ఎమెల్యేలు ఎవరూ కూడా తమ పార్టీలో చేరలేదని, తెరాస పార్టీ విధానాలు నచ్చకనే, వారు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మారారని డీకే అరుణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారు అని విమర్శించారు. తనకు తెరాసలో చేరమని ఆఫర్ వచ్చిందని, తాను తిరస్కరించడం వల్లే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ తన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. కొంతమంది నేతలు చేస్తున్న అల్లరి వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందని, తనకు పిసిసి అధ్యక్ష భాధ్యతలు అప్పగిస్తే పార్టీని సమర్థవంతంగా నడిపిస్తానని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply