బ్రిగ్జిట్ ప్రభావం నుండి బయటపడటానికి భారత్ కు అతనే దిక్కా..!

బ్రిగ్జిట్ ప్రభావంతో ప్రపంచం మొత్తం కుదేలయ్యింది. ముఖ్యంగా భారత దేశంపై తీవ్ర ప్రభావం చూపించింది. స్టాక్ మార్కెట్ తీవ్రంగా నష్టపోయింది. బంగారం ధర భారిగా పెరిగిపోయింది. దేశం మళ్ళి ఆర్ధిక మాంద్యం వైపు పయనిస్తుందా అనే అనుమానాలు ఆర్ధికవేత్తల్లో వస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి చూపు ఒక్కసారిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వైపు మళ్ళింది. ఎందుకంటే గతంలో భారత్ ఎదుర్కొన్న రెండు తీవ్ర ఆర్ధిక సంక్షోభాలాలో మన్మోహన్ సింగ్ దేశాన్ని గట్టెక్కించారు. 1992 ఆర్ధిక సంక్షోభంలో ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశాన్ని గట్టెక్కించాడు. తరువాత 2008లో ప్రపంచం అంతా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో విలవిల్లాడుతుంటే ఆ ప్రభావం మన దేశంపై పడకుండా మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో మరోసారి దేశాన్ని రక్షించాడు. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం మన్మోహన్ సహాయాన్ని తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జనతాదళ్(యూ) నేతలు అయితే బహిరంగంగానే మన్మోహన్ సహాయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి మోడీ ప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి..

Leave a Reply