బయట పడుతున్న షాకింగ్ విషయాలు..

పొలిసు కాల్పుల్లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించిన విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలిసుల సోదాలో జరిగిన సోదాలో వేల కోట్ల రూపాయలు బయట పడి అందరిని ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే నయీం ఇంతగా రెచ్చిపోవడానికి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉండడమే కారణం అనే వార్తలు రావడం సంచలనం సృష్టిస్తుంది. ఈ విషయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలిపారు. గ్యాంగ్ స్టర్ నయీం చంద్రబాబు  పెంచి పోషించిన విష నాగు అని,  ప్రజా కళాకారులను, పౌరహక్కుల నేతలను,ప్రజా సంఘాల నాయకులను చంపిన నరరూప రాక్షసుడు నయీం అని సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు.చంద్రబాబు ఇచ్చిన అండదండలతోనే  నయీం నక్సలైటు స్థాయి నుండి గ్యాంగ్‌స్టర్‌ స్థాయికి ఎదిగాడని తెలిపారు. నక్సలైట్లను అంతమొందించటానికి చంద్రబాబు నయీంలాంటి బ్లాక్‌ కోబ్రాలను పెంచారని సోలిపేట రామలింగారెడ్డి ఆరోపించారు. 2004లో ఒకసారి, 2008లో మరోసారి నయీం తనను బెదిరించారని సోలిపేట రామలింగారెడ్డి చెప్పారు. 2008లో తమ గ్రామం చిట్టాపూర్‌కు నయీం, అతని అనుచరులు వచ్చి తనను చంపివేస్తామని బెదిరించారని, దీనిపై అప్పుడు సిద్దిపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు తన పిర్యాదును పట్టించుకోలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లుగా నయీం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని, అప్పటి అధికార పార్టీ నాయకులు, అధికారులు ఈ రాక్షసుని చేతిలో కీలుబొమ్మలుగా మారారని తెలిపారు. దుబ్బాక పరిసర గ్రామాల్లో నయీం అనుచరులు ముగ్గురిని కిడ్నాప్‌ చేశారనీ, ఇప్పటికీ వారి ఆచూకీ దొకరలేదన్నారు.

 

Leave a Reply