కేంద్రం రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాలి – ఎంపి వినోద్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హై కోర్ట్ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెరాస ఎంపి వినోద్ ఆరోపించారు. తెలంగాణ న్యాయముర్తులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ బాధపడుతున్నారు అని వినోద్ పేర్కొన్నారు. న్యాయ వాదుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని వినోద్ తెలిపారు. న్యాయమూర్తుల సమస్యల పరిష్కారం కోసం ఒక ముఖ్యమంత్రి ధర్నా చేయడం ఇదే మొదటిసారని వినోద్ పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి ధర్నా చేయకముందే కేంద్రం సమస్యను పరిష్కరించాలని వినోద్ కోరారు. న్యాయముర్తులపై వేసిన సస్పెన్షన్ ఎత్తి వేయాలని కూడా ఆయన కోరారు.

Leave a Reply