రాజమండ్రిని పాకిస్తాన్ బోర్డర్ లా చేశారు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. రాజమహేంద్రవరాన్ని పాకిస్తాన్ బోర్డర్ లా మార్చేశారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. గతంలో హిట్లర్, ముస్సోలినీ ఉద్యమకారులను అణచి వేయాలని చూశారని, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో ముద్రగడను మానసికంగా బలహీనపరచేందుకు 13 రోజులు ఆస్పత్రిలో నిర్భందించారని ఉండవల్లి వ్యాఖ్యానించారు. దీని వల్ల ముద్రగడకు మంచే జరిగింది అని, దీక్ష సమయంలో ముద్రగాడకు టీవీ,పేపర్,ఫోన్ కూడా లేకుండా చేశారని ముద్రగడ ఆరోపించారు.

Leave a Reply