మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంపై గవర్నర్ ప్రశంసలు..

తెలంగాణలో జరుగుతున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా నేడు గవర్నర్ నరసింహన్ సిద్ధిపేట నియోజకవర్గంలోని మంత్రి హరీష్ రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ లో పర్యటించారు. గవర్నర్ ఇబ్రహీంపూర్ లో జమ్మి చెట్టును నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్, ఇబ్రహీంపూర్ లో అభివృద్దిని చూస్తే తనకు ముచ్చటేస్తుందని, మంత్రి హరీష్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. తాను ఇక్కడకు వచ్చి చాలా నేర్చుకున్నాను అని, హరీష్ రావు ఏ విధంగానైతే గ్రామాన్ని దత్తత తీసుకున్నారో అదేవిదంగా అందరు ప్రజా ప్రతినిధులు గ్రామాలను దత్తత తీసుకోవాలని చట్టం తీసుకు రావాలని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఇబ్రహీంపూర్ సింబల్ ఆఫ్ తెలంగాణగా మారిందని, హరీష్ రావు పట్టుబడితే వదలడని కితాబునిచ్చారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలందరి సమిష్టి కృషితోనే ఇబ్రహీంపూర్ అభివృద్ధి చెందిందని, ఒకే రోజులో 1.05 లక్షల మొక్కలు నాటి రాష్ట్రానికి స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణకు కూడా కృషి చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Leave a Reply