ఒకే రోజు లక్ష 5 వేల మొక్కలు నాటడమే లక్ష్యం..

తెలంగాణలో హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు దత్తత గ్రామమైన మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ లో నేడు జరగనున్న హరితహారం కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాలు పంచుకోబోతున్నారు. ఇబ్రహీంపూర్ లో గవర్నర్ జంబి మొక్కను నాటనున్నట్లు తెలుస్తుంది. రెండో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపూర్ గ్రామస్తులు 2 లక్షల 10 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా, మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో జోరు వానను సైతం లెక్కచేయకుండా ఒకే రోజు లక్షా 5 వేల మొక్కలను నాటారు. ఇది తెలుసుకున్న గవర్నర్ ఇబ్రహీంపూర్ కు వస్తానని మంత్రి హరీష్ రావుకు మాట ఇచ్చారు. అందుకు తగ్గట్లుగానే నేడు ఇబ్రహీంపూర్ లో గవర్నర్ ఇబ్రహీపూర్ పర్యటనకు నేడు వస్తున్నారు. ఇబ్రహీంపూర్ గ్రామస్తుల లక్ష్యాన్ని చేరుకోవాదానికి అవసరమైన లక్ష 5 వేల చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ మంత్రి హరీష్ రావు దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే ఈ పర్యటనలో ఇబ్రహీంపూర్ గ్రామ అభివృద్ధిపై తీసిన డాక్యుమెంటరీని సైతం మంత్రి హరీష్ రావు గవర్నర్ కు చుపించాబోతున్నారు.

Leave a Reply