ఎడిటోరియల్: తెలంగాణలో మహా కూటమి..

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరగాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఎదురు లేదు. ఏ ఎన్నిక వచ్చినా తెరాస ఘన విజయాలు సాధిస్తుంది. అదే విధంగా ప్రతి పక్ష పార్టీల నుండి భారిగా వలసలను ప్రోస్తహిస్తుంది. ఎమేల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులను కూడా తెరాస భారిగా పార్టీలో చేర్చుకుంటుంది. దాంతో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి దాపురించింది. అయితే అవి ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నట్లు కనిపిస్తునాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ని ఘన విజయాలు సాధిస్తున్నా ఆ పార్టీ ఓటు బ్యాంకు 40 శాతం కుడా దాటడం లేదు. అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఆశలు రేపుతుంది.  దానికి ఉదాహరణగా బిహార్ ఎన్నికలను చుపెడుతున్నాయి. అక్కడ బలంగా ఉన్న బిజేపిని నిలువరించడానికి మిగిలిన పక్షాలు అన్ని కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. ఫలితంగా బిజేపి సొంతంగా 40 శాతం ఓట్లు సంపాదించిన గెలవలేకపొయింది. అందువల్ల తెలంగాణలో కూడా ప్రతి పక్ష  పార్టీలు కలిసి పోటి చేస్తే తెరాసను నిలువరించడం కష్టమేమి కాదని భావిస్తున్నాయి. ఆ దిశా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్ష పార్టీలైన కాంగ్రెస్, తెదేపాలు కలిసి పోటి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఆ పార్టీలు ఇప్పటికే పాలేరు ఉప ఎన్నికల్లో, అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటి చేశాయి. తెలంగాణలో అదికార పార్టీ అయిన తెరాస కంటే బలమైన క్యాడర్ ఉన్న కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కలిసి పోటి చేస్తే ఏమైనా జరగోచ్చు.

Leave a Reply