పార్లమెంట్ లో మాట్లాడండి..

తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని దేశ వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై స్పందించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ పార్లమెంట్ లో దళితులపై దాడుల గురుంచి ఎంపీలు ఆందోళనలు చేస్తుంటే ప్రధాని బయటి సభల్లో స్పందించడం ఏమిటని ఆజాద్ ప్రశ్నించారు. ప్రధాని దళితులపై జరుగుతున్న దాడులను తెలంగాణలో స్పందించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినిపించలేదు. అదేదో పార్లమెంట్ లో ప్రకటిస్తే బాగుండేదని ఆజాద్ వ్యాఖ్యానించారు.

Leave a Reply