హరీష్ రావు, కవితలకు అరుదైన గౌరవం..

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి టి. హరీష్ రావు మరియు నిజామాబాద్ ఎంపి కవితలకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్ళే బృందంలో హరీష్ రావు, కవితలకు చోటు కల్పించారు. ఈ మేరకు హరీష్ రావు, కవితలకు ఆహ్వానాలు అందించారు. ఇజ్రాయిల్ పర్యటనలో ఈ బృందం సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే విధానాన్ని, విద్యుత్ ను ఆదా చేయడం, స్ప్రింక్లర్, డ్రిప్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులను పరిశీలిస్తారు.

Leave a Reply