రైతుల ఉసురు పోసుకోవద్దు – ప్రతిపక్షాలకు మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 123 పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమయ్యే భూసేకరణలో జాప్యం నిరోదించెందుకే జీవో 123 విడుదల చేశామని హరీష్ రావు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆకుపచ్చగా మారాలని హరీష్ రావు ఆకాంక్షించారు. కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాకు ఉన్న 13 వందల టీఎంసీల నీటిని సమర్థవంతంగా వినియోగించుకుంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాజెక్టులను ఆపి రైతుల ఉసురు పోసుకోవద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర  ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రైతులు ఏ విధంగా నష్టపరిహారం కోరితే ఆ విధంగా నష్టపరిహారం అందిస్తామన్నారు.

Leave a Reply