కృష్ణా నీటి వివాదంపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..

కృష్ణా జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న వైకరిపై తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న సూచనలను పట్టించుకోకుండా, మొండి వైకరితో వ్యవహరిస్తూ, వితండవాదం చేస్తుందని ఆరోపించారు. చర్చలు పూర్తిగా అసంపూర్తిగా మిగిలాయి అని,  కృష్ణా జలాలపై స్పష్టత రాలేదు అని హరీష్ రావు పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా అవార్డు ఇచ్చిందని, దానిని ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. తమ హక్కు ప్రకారమే తెలంగాణకు రావాల్సిన 90 టీఎంసీల నీటిని వాడుకుంటామని తేల్చి చెప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్ళు కావాలో వారికే స్పష్టత లేదని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించేందుకు అధికారులను నియమిస్తామని కేంద్రం చెబితే ర్హాము ఒప్పుకున్నాము అని, కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచిత్ర వైకరి అనుసరించడం వల్ల చర్చలు అసంపూర్తిగా మిగిలాయి అని హరీష్ రావు తెలిపారు.

Leave a Reply