కీలక పాత్ర పోషించిన మంత్రి హరీష్ రావు..

తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాక ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళ కోసం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలం నుండే చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్రం ఏర్పడిన వెంటనే కీలకమైన ఇరిగేషన్ శాఖ నిర్వహిస్తున్న మంత్రి హరీష్ రావు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అవరోధాలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రధాన అడ్డంకిగా మారిన మహారాష్ట్ర ప్రభుత్వంతో, గత రెండు సంవత్సరాలుగా పలు దఫాలుగా చర్చలు జరిపారు. అనేక సార్లు మహారాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో సమావేశం అయ్యారు. ఎట్టకేలకు చర్చలు ఓ కొలిక్కి వచ్చి మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరించింది. హరీష్ రావు కృషిని కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అభినందించారు.

 

Leave a Reply