ప్రజా ఉద్యమంలా హరిత హారం..

తెలంగాణలో రెండో విడుత హరిత హారం కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులతో సమావేశం ఐనా కేసీఆర్, తెలంగాణలో అడవుల విస్తీర్ణం 33 శాతం వరకు పెంచడమే లక్ష్యంగా హరిత హారం కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 8న హరిత హారం కార్యక్రమం మొదలవుతుందని, రెండువారాల పాటు కొనసాగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇందులో విద్యార్థీ నుండి సిఎం వరకు అందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పౌరులు అందరు పాల్గొనాలని కేసీఆర్ కోరారు. 46 కోట్ల మొక్కలు సిద్దంగా ఉన్నాయి అని, అన్ని మొక్కలు ఒకేసారి నాటిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించాలని కేసీఆర్ కోరారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. సోషల్ మీడియాలో హరిత హారంపై విసృతంగా చర్చ జరగాలని, రాష్ట్రం మొత్తం ప్రచారంతో హోరెత్తాలని ఆయన కోరారు. అలాగే అధికారులకు చెట్ల పెంపకంపై, కవి సమ్మేళనాలు, చిత్ర లేఖన పోటీలు జరపాలని ఆదేశించారు.

Leave a Reply