ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట..!

తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ లో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ తెలంగాణ మధ్య మొదలైన పాడి పరిశ్రమ ఆస్తుల వివాదంలో హై కోర్ట్ తెలంగాణకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. హైదరాబాద్ లోని ఏపీ డయిరీ ఆస్తులను తెలంగాణకు బదిలీ చేయాలంటూ మే 6న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం హై కోర్ట్ ను ఆశ్రయించింది. తొమ్మిదో షెడ్యూల్ లో ఉన్న ఏపీ డెయిరీ ఆస్తులను చట్ట విరుద్దంగా బదిలీ చేసుకున్నారంటూ ఆంద్రప్రదేశ్ వాదించింది. అయితే తెలంగాణ మాత్రం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే బదిలీ చేశామని తెలంగాణ వాదించింది. ఆంధ్రప్రదేశ్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, భాధ్యతలు, ఆస్తుల విభజన జరగక ముందే ఎలా బదిలీ చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదికి వాయిదా వేసింది.

Leave a Reply