కశ్మీర్ లో శాంతి భద్రతలే లక్ష్యం..

గత 46 రోజులుగా కశ్మీర్ రణరంగంగా మారింది. ఉగ్రవాది బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ తర్వాత కశ్మీర్ లో ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ జరుగుతున్న అల్లర్లలో ఇప్పటి వరకు 65 మంది మరణించగా, 8 వేల మంది గాయపడ్డారు. కశ్మీర్ లో పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం మిషన్ కశ్మీర్ ను చేపట్టింది. అందులో భాగంగా భారత హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కశ్మీర్ కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి కశ్మీర్ లోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరితో సమావేశం కానున్నారు. ఇప్పటికే అందరికి ఆహ్వానాలు అందించారు. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీని కలిసిన ప్రతిపక్ష నేతలు కశ్మీర్ అంశంపై వివరించారు అందుకు కొనసాగింపుగానే కశ్మీర్ లో రాజ్ నాథ్ పర్యటన జరగనున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply