ఆయన ఒక ఖల్ నాయక్.. ఇస్లాంను అవమానించారు..

ప్రముఖ ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఆయన ఇచ్చిన ప్రసంగాల స్పూర్తితోనే బంగ్లాదేశ్ లోని ఢాకాలో విధ్వంసం సృష్టించినట్లు తీవ్రవాదులు పేర్కొనడంతో జకీర్ చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. ఆయన నడిపిస్తున్న పీస్ టీవీని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు తాజాగా ‘హుస్సైని టైగర్స్’ అనే ఒక షియా సంస్థ జకీర్ నాయక్ పై 15 లక్షల రివార్డ్ ను ప్రకటించింది. ఆయన ఒక ఖల్ నాయక్ అని, ఇస్లాంను అవమానించారని హుస్సైని టైగర్స్ అధినేత సైయద్ కల్బె హుస్సైని నఖ్వి ఆరోపించారు. అయితే జకీర్ నాయక్ మాత్రం తన ప్రసంగాలను ఉగ్రవాదులు తప్పుగా అర్థం చేసుకున్నారని, తనపై వస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారం అని ప్రకటించారు. రేపు స్కైప్ ద్వారా మీడియాతో మాట్లాడతానని జకీర్ నాయక్ పేర్కొన్నారు.

Leave a Reply