వారసత్వ పోరుపై మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు టీఆర్ఎస్ లో జరుగుతున్న వారసత్వ పోరుకు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. తెరాసలో ముఖ్యమంత్రి కెసిఆర్ తర్వాత ఎవరు వారసుడు అనే ప్రశ్పైన గత కొంత కాలంగా చర్చ జరుగుతుంది అయితే దీనిపై స్పందించిన మంత్రి హరీష్ రావు తనకు జీవితంలో ఇదే పెద్ద పదవి అని, ఇంతకంటే పెద్ద పదవి రాదు అని అన్నారు. అధికారంలో తనను ఇంతగా ఆదరించిన మెదక్ జిల్లా ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని హరీష్ రావు పేర్కొన్నారు, ఎన్ని అవాంతరాలు ఎదురైన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టి తీరుతామని ఆయన పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ముంపు భాదితులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి అని, పైన కేసీఆర్ ఉన్నారు, ఇక్కడ తాను ఉన్నాను అని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టి, 7.5 లక్షల ఎకరాలకు నీరు అందించి మెదక్ జిల్లా వాసుల ఋణం తీర్చుకుంటామని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply