మనం ప్రపంచాన్నే శాసిస్తాం…

ప్రపంచంలోని ప్రతిభావంతులు అందరు భారతీయులేనని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కే. తారక రామారావు పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్ప కళా వేదికలో జరిగిన సియోంట్ డిజిటల్ సెంటర్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ప్రస్తుతం ప్రపంచంలో డిజిటల్ విప్లవం నడుస్తుందని తెలిపారు. మన దేశంలో 50 శాతం మంది పాతికేళ్ళలోపు వారేనని, సరిగా చదువుకుంటే ప్రపంచాన్నే శాసించవచ్చని ఆయన అన్నారు. భారత దేశంలో ఐటికి అనుకులమైన పరిస్థితులు ఉన్నాయని,ఒకప్పుడు అమీర్ పేటలో కేవలం ఒక కాంప్లెక్స్ లో మాత్రమే ఐటి కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వేలాది కంపెనీలు హైదరాబాద్ లో ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు 10 కోట్లుగా ఉన్న ఐటి టర్న్ ఓవర్ ఇప్పుడు కొన్ని వేల కోట్లకు చేరుకుందని, 12 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని కేటీఆర్ వివరించారు.

Leave a Reply