అధ్యక్షత వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..

నేడే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అంతర్ రాష్ట్ర మండలి సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు పాల్గొంటారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలు చర్చిస్తారు. అలాగే రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను కుడా చర్చిస్తారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రెటరీలు హస్తినకు చేరుకున్నారు. సాయంత్రం వరకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.ఇదే సమావేశంలో ప్రధాని రహస్యంగా ముఖ్యమంత్రుల పనితీరుపై చేయించిన సర్వే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రధాని చేయించిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు 13వ స్థానం వచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply