చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు – కేసీఆర్

తెలంగాణ – మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాల మధ్య కీలకమైన నదీ జలాల ఒప్పందంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫద్నవిస్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసమేనని, అందుకోసం పొరుగు రాష్ట్రాలతో సఖ్యతతో ఉండి, నీళ్ళను సాధించుకుంటామని తెలిపారు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ తో నీటి వివాదాలు ఉన్నాయి కాని, మహారాష్ట్రతో వివాదాలు లేవని తెలిపారు. ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని కేసీఆర్ తెలిపారు. భవిష్యత్తులో కుదిదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య స్నేహం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

Telangana‬ projects to be built after MoU with ‪Maharashtra‬ government

Leave a Reply