మేము దానికి వ్యతిరేకం..

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి మండిపడ్డారు. తమ పార్టీ ఎప్పుడు ఐసిస్ కు వ్యతిరేకం అని, ఆ విషయం ముందునుండి చెబుతున్నామని అసద్ తెలిపారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంతమొందించాలని, అవసరమైతే మిలటరీ సహాయం కుడా తీసుకొని ఐసిస్ ను అంతం చేయాలని సూచించారు. అంతేకాకుండా దాని భావజాలాన్ని మొత్తాన్ని రూపు మాపాలని ఆయన కోరారు. ఐసిస్ పై వ్యతిరేక భావజాలం ఉన్న మహ్మద్ అబుల్ హుదా అనే స్కాలర్ ను పిలిపించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply