మంచి పనులు చేస్తుంటే టీఆర్ఎస్ స్కాములు చేసినట్లా..?

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మంది పడ్డారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రజలను రెచ్చగొడుతున్నారు అని విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ గత 40 సంవత్సరాల నుండి ఉంది అని, ఎన్టీఆర్ మొదలుకొని, చంద్రబాబు, వైఎస్ వరకు అందరు జిల్లాల ఏర్పాటును ఎన్నికల హామీగా వాడుకున్నారు అని, వారు హామీలు ఇస్తే సిఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం  ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసిందని హరీష్ రావు తెలిపారు. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు,స్కాంలు మినహా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ను ఆయన కాంగ్రెస్ ను స్కాంగ్రెస్ గా అభివర్ణించారు.స్కాములు చేసింది మీరు, జైళ్లలో పడ్డది మీరు,కోర్టుల చుట్టూ తిరుగుతున్నది మీరు అని హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. మంచి పనులు చేస్తుంటే తెరాస స్కాములు చేసినట్లా అని ప్రశ్నించారు.

Leave a Reply