కేసీఆర్ పరిపాలన దక్షతకు కలికితురాయి..!

ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య మంత్రుల పనితీరుపై రహస్యంగా చేసిన చేసిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కేసీఆర్ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో హరిత హారం ఒక ప్రజా ఉద్యమంలా కొనసాగుతుందని తెలిపారు. కాకతీయుల స్పూర్తితో కేసీఆర్ మిషన్ కాకతీయ పనులు చేపట్టారని పేర్కొన్నారు. అపర భగీరథుడులా మిషన్ భగీరథ, అభినవ అశోకుడిలా హరిత హారం లాంటి పథకాలతో కేసీఆర్ దేశానికే మార్గదర్శిగా మారారని తుమ్మల ప్రశంసించారు. దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలవడం సంతోషకరం అని, ఆయన పరిపాలన దక్షతకు కలికితురాయిగా నిలిచారని తుమ్మల పేర్కొన్నారు.

Leave a Reply