కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ..

ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఈ సందర్బంగా ఏపీ భవన్‌ పూర్వ హైదరాబాద్‌ స్టేట్‌కు చెందిన ఆస్తి అని, దానిని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాల్సిందే అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఏపీ భవన్‌ ప్రాంతమంతా ఒకప్పటి హైదరాబాద్‌ స్టేట్‌కు చెందినదని, అది మొత్తం 18.8 ఎకరాల్లో విస్తరించి ఉందన్నారు. హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత భారత ప్రభుత్వం హైదరాబాద్‌ హౌస్‌తో పాటు 7.5 ఎకరాల పటౌడి హౌస్‌ మరియు 1.21 ఎకరాల నర్సింగ్‌ ఇనిస్టిట్యూట్‌ లను తీసుకుని వాటికి ప్రత్యామ్నాయంగా  ఏపీ ప్రభుత్వానికి స్థలాన్ని అప్పట్లో కేటాయించారన్నారు. అలాగే నిజాంకు సంభందించిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, ఆ భవనాలను ఉమ్మడి వనరుల నుంచే నిర్మించారని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.

 

Leave a Reply