నేను ఏదంటే అది జరుగుతుంది – కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తన దత్తత గ్రామాలైనా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఎర్రవెల్లి గ్రామంలోని యువకులకు 42 ట్రాక్టర్లు పంపిణి చేశారు. తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఎర్రవెల్లి ,నర్సన్న పేటలో ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని, ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు, 24 గంటలు తాగునీరు అందుబాటలో ఉంచేందుకు ప్రతి ఇంటికి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎర్రవెల్లి స్వయం సమృద్ధి గ్రామం అని, గ్రామంలో ఏ అభివృద్ధి జరిగినా అందరికి తెలియాలని, రెండేళ్ళ తర్వాత పాములవర్తికి గోదావరి జలాలు వస్తాయన్నారు. తాను ఏమంటే అది జరుగుతుందని, అది తన జాతకంలోనే ఉందని, ఎర్రవెల్లి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను అని, అది తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను అని కెసిఆర్ తెలిపారు.

Leave a Reply