తగ్గేదే లేదంటున్న కోదండరాం..!

తెలంగాణ జేఏసి చైర్మన్ కోదండరాం కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. తెరాస శ్రేణులు ఒక్కసారిగా కోదండరాంపై విరుచుకుపడుతున్నాయి. అయితే కోదండరాంకి మాత్రం అస్సలు తగ్గే ఉద్దేశం లేనట్లు కనబడుతుంది. మరింత తీవ్రంగా కెసిఆర్ పై విరుచుకుపడుతున్నారు. మెదక్ జిల్లా తొగుట మండలంలోని ఏటిగట్ట కిష్టాపూర్, వేముల ఘాట్ గ్రామాల్లో పర్యటించిన కోదండరాం మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరోసారి కెసిఆర్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ళు గొర్రెల మంద మీద పడినట్లుగా తెలంగాణ ప్రభుత్వం భూమిని నమ్ముకున్న రైతుల మీద పడుతుందని విమర్శించారు. ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. గత పాలకుల బాటలోనే ఇప్పటి పాలకులు కూడా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. 50 టిఎంసిల నీటి కోసం 14 గ్రామాలను ఖాళీ చేయించడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని కోదండరాం తెలిపారు. అవసరం అయితే మేథాపాట్కర్ ను తీసుకువచ్చి పోరాడతామని పేర్కొన్నారు.

Leave a Reply