కెసిఆర్ పై విరుచుకుపడ్డ కోదండరాం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పై టిజేఎసి చైర్మన్ కోదండరాం విరుచుకుపడ్డాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కోదండరాం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఒకానొక సమయంలో ఉద్యమంలో కెసిఆర్ నే మించిపోయాడు. అటువంటి కొదందారాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా నిశబ్దంగా ఉండిపోయాడు. అప్పుడప్పుడు ప్రభుత్వంపై మాట్లాడినా అవి కేవలం ఆయన ప్రభుత్వానికి చేసిన సూచనలే. కాని ఇప్పుడు కోదండరాం ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో  హెచ్చరించాడు. హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ విద్యావంతులసదస్సులో మాట్లాడిన కోదండరాం రెండేళ్ళ కెసిఆర్ పాలన తమకు అసంతృప్తి కలిగిస్తుందని, చేతకాకుంటే తప్పుకోవాలని, తాము పరిపాలిస్తామని ప్రభుత్వాన్ని విమర్శించాడు. ప్రభుత్వం కేవలం హైదరాబాద్ పై మాత్రమే దృష్టి పెడుతుందని, అయితే మిగతా జిల్లాలను కుడా పట్టించుకోవాలని కోదండరాం సూచించాడు. ఉమ్మడి రాష్ట్రంలో లాగానే రియల్ ఎస్టేట్, కాంట్రాక్టు, కార్పొరేట్ కంపెనీలకు మాత్రామే లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించాడు. రెండేళ్ళ తెరాస ప్రభుత్వ పాలనతో ఆశించిన ఫలితాలు రాలేదని,ప్రజల బతుకుదెరువు విస్తరించే ప్రయత్నమే జరగలేదని, వ్యవసాయం, కుల వృత్తులపై అధ్యయనంమే మొదలవలేదని, అటువంటప్పుడు ప్రజలకు ఫలితాలు ఎప్పుడు అందుతాయని కొదందారాం అభిప్రాయపడ్డాడు. వ్యవసాయాన్నివిస్మరించారని, అందుకే రైతుల ఆత్మ హత్యలు ఆగడం లేదని విమర్శించారు. తమకు అత్యాశ లేదని, ప్రజలు బాగుపదాలనేదే తమ అంతిమ లక్ష్యం అని అందువల్లే జేఏసి ఇంకా పని చేస్తుందని లేదంటే ఎప్పుడో తెరాసలో విలీనం చేసేవారమని కొదందారాం అన్నారు.

Leave a Reply