కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్న..?

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. ఇటి రంగంలో ఉద్యోగాలు, పెట్టుబడుల కోసం హైదరాబాద్ కు కేటాయించిన ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రం అనుసరిస్తున్న వైకరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రానికి అంతా గందరగోళంగా ఉందని, స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. కేంద్రం ఇష్టమొచ్చినట్లు నిధులు కేటాయిస్తుందని, నిధులు ఏమైనా చాక్లేట్లా ఎలా పడితే అలా ఇవ్వడానికి, ఒక పద్ధతి అంటూ లేదా అని కేంద్రాన్ని కేటిఆర్ ప్రశ్నించారు. కేంద్రం వైకరి ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాల రూప కల్పనకు కృషి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply