కనీస అవసరాలు కూడా తీర్చలేరా…?

జీహెచ్ఎంసీ సమావేశంలో తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నగరంలో రోడ్లు వేసిన వెంటనే గుంతలు తవ్వుతున్నారు అని, కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా, చిన్న వర్షానికి అవి పాడై పోతున్నాయి అని, అధికారుల మధ్య సమన్వయ లోపంతో నగర ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని ఆయన అన్నారు. ట్రాఫిక్ కారణంగా తాను 20 నిమిషాలు సమావేశానికి ఆలస్యంగా వచ్చాను అని, అంబులెన్సుకు దారి ఇవ్వని నగరం విశ్వనగరం కాదని ఆయన పేర్కొన్నారు. నగర రోడ్లు కూడా ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్ పోర్ట్ రోడ్ల మాదిరిగా చేయాలి అని మంత్రి అధికారులకు ఆదేశాలు జారి చేశారు. ఒక సగటు పౌరుడిగా ఆలోచిస్తే చాల సమస్యలు నగరంలో కనిపిస్తున్నాయి అని,వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Leave a Reply