మేక్ ఇన్ తెలంగాణ లక్ష్యంగా..!

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. మేక్ ఇన్ తెలంగాణ కోసం పలుదేశాల ప్రతినిధులతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు జపాన్ రాయబారి యుపాక కిటుకుతో సమావేశం అయిన కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయనకు వివరించారు. 11 గంటలకు ప్రముఖ వ్యాపారవేత్త సునీల్ మిట్టల్ తో సమావేశం అయ్యి, తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు.. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. తరువాత సాయంత్రం 4 గంటలకు తైవాన్ రాయబారి తుంగ్ కవాంగ్ తో కేటీఆర్ సమావేశం అవుతారు. 5 గంటలకు దక్షిణ కొరియా రాయబారి హ్యున్ చావ్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు.

Leave a Reply