కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత..!

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. బుధవారం హైదరాబాద్ లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద స్కాంలుగా మారనున్నాయని జోస్యం చేప్పారు. మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకాలతో రూ. 2 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్ తెర లేపారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిధులను, పార్టీ అభివృద్ధికే వినియోగిస్తున్నారని భట్టి విమర్శించారు.

Leave a Reply