అన్ని తానై చూసుకున్న ట్రబుల్ షూటర్…

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో తొలి పర్యటన దిగ్విజయంగా ముగిసింది. అయితే తెలంగాణలో మోడీ పర్యటన ముగిసినప్పటి నుండి అందరు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీస్ రావును అందరు అభినందిస్తున్నారు. ప్రధాని తొలి పర్యటనను ఎంతో ఘనంగా నిర్వాహించారంతో హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. ప్రధాని పర్యటనకు నాలుగు రోజుల ముందు నుండి గజ్వేల్ లో తిష్టవేసిన హరీష్ రావు సభా స్థలి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. అలాగే సభకు వచ్చే జనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు. వీఐపీల వాహనాల పార్కింగ్ దగ్గర నుండి సభకు వచ్చిన జనాల సౌకర్యాల వరకు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత పకడ్బందీగా, ప్రణాళికబద్దంగా అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ప్రధాని సభకు అధ్యక్షత వహించిన హరీష్ రావు అక్కడ కూడా తన మార్క్ చూపారు. వేదికపై ఉన్న ప్రముఖులను సభకు వచ్చిన వారికి పరిచయం చేయడం దగ్గర నుండి ముగింపు ప్రసంగం వరకు అందరిని ఆకట్టుకున్నారు. మొత్తానికి హరీష్ రావును తెరాసలో ట్రబుల్ షూటర్ అని ఎందుకంటారో మరో సారి అందరికి అర్థం అయ్యింది.

Leave a Reply