కేంద్రంతో ఘర్షణ వైఖరి కోరుకోవడం లేదు – కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం నిధుల విషయమై గత కొన్ని రోజులుగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ, తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు దత్తాత్రేయను కలిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ దత్తాత్రేయను విమర్శించేంత స్థాయి తనకు లేదని, ఐటీఐఆర్ పై కేంద్రానికి పూర్తి వివరాలు తెలియజేశామని తెలిపారు. అధికారులు కేంద్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని, మెట్రో రైలు నిధుల గురుంచి దత్తాత్రేయతో చర్చించామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం కేంద్రంతో ఘర్షణ వైఖరిని కోరుకోవడం లేదని, కలిసి పనిచేయాలని భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply