తాజా పరిస్థితిపై ప్రధాని దిగ్బ్రాంతి…

భారత ప్రధాని నరేంద్ర మోడీని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో జమ్మూ కశ్మీర్ ప్రతిపక్ష నేతలు కలిశారు. వారు మోడీకి కశ్మీర్ ప్రస్తుత పరిస్థితిని మోడీకి వివరించారు. కశ్మీర్ లో పెల్లెట్ తుపాకుల వినియోగం పై నిషేధం విధించాలని ఒమర్ ప్రధానిని కోరారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించాలని ఒమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భేటి అనంతరం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం కశ్మీర్ లో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితిపై ప్రధాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అల్లర్లలో ప్రాణాలు కోల్పోవడం నిరుత్సాహకరమైన విషయం అని, వారు యువకులైనా, భద్రతా దళాలైనా, పోలిసులైనా మన వాళ్ళని, మన దేశాస్తులని మోడీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి లోబడి కశ్మీర్ కు శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటామని మోడీ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply