నేరస్తులతో నేతలు చేతులు కలపడం దారుణం..

పోలిసుల ఎన్కౌంటర్ లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీం గురుంచి పూర్తి వివరాలు ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై టీ. జేఏసీ చైర్మన్ కోదండరాం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు, అధికారులు నేరగాళ్ళతో చేతులు కలపడం దారుణం అని, కోదండరాం పేర్కొన్నారు. నయీం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, నయీంతో సంబంధాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయాలని కోదండరాం కోరారు. అలాగే నయీం డైరీలో ఉన్న పేర్లను బహిర్గతపరచాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిఘా పెట్టాల్సింది నేరస్తుల పైన అని, జేఏసీ పైన నిఘా పెడితే అది తెలంగాణకు మంచిది కాదని కొదందారం పేర్కొన్నారు.

Leave a Reply