త్వరలో కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు..!

ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోడీ తన మంత్రి వర్గంలో భారీ మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం తర్వాత కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది. కేంద్ర మంత్రి సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా వెళ్ళడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఉత్తరాఖండ్ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేదు అందుకని ఆ రాష్ట్రానికి ఈ సారి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ నుండి భగత్ సింగ్ కోశ్యారి, అజయ్ టాంటా లకు అవకాశం లభించబోతుంది. యూపీ నుండి ప్రధానంగా సాధ్వి సావిత్రి బాయి, యోగి ఆదిత్యనాత్, సత్యపాల్ సింగ్ ల పేరు వినిపిస్తున్నాయి.అస్సాం నుండి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తున్నారు.అలాగ్ర్ ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్టాల నుండి కుడా అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply