భూమి ముక్కలవుతుందేమో అన్నట్లు కంపించింది…

భారత్ – పాకిస్తాన్ సరిహద్దులో సోమవారం భూమి కంపించింది. భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలోని జలందర్, అమృత్ సర్ నగరాలతో పాటు లాహోర్, షేక్ పురాలో భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ళలో నుండి భయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదు అయ్యింది. లాహోర్ కు 37 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రముఖ పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ భూమి ముక్కలవుతుందేమో అన్నట్లు భూమి కంపించిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Leave a Reply