ఆమె ఎవరంటే..?

హిల్లరీ క్లింటన్.. అమెరికా అధ్యక్ష పదవికి పోటి పడుతున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్నారు. అయితే హిల్లరీకి అంత శక్తి, ప్రరణ ఇచ్చింది ఎవరో తెలుసా..? తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత హిల్లరీకి ప్రేరణ, శక్తి ఇచ్చారంట. ఈ విషయాన్ని అన్నాడీఎంకే శాసనసభ్యుడు రాము ఏకంగా అసెంబ్లీలోనే బల్లగుద్ది మరి చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం హిల్లరీ ఇండియాకు వచ్చినప్పుడు జయలలితను కలుసుకున్నారని, అమ్మతో మాట్లాడాక ఎంతో స్పూర్తి పొందారని రాము తెలిపారు. అమ్మ ఇంగ్లీష్ ప్రావీణ్యాన్ని చూసి హిల్లరీ ఆశ్చర్యపోయారని, ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ప్రేరణ పొందారని ఆయన వివరించారు.

అమ్మగా పిలుచుకునే జయలలిత పార్టీ శ్రేణులు ఆమెను పొగడడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఏకంగా హిల్లరీ క్లింటన్, జయ వల్ల స్పూర్తి పొందారనడం జయకు వారిపై ఉన్న అభిమానాన్ని సూచిస్తుంది.

Leave a Reply