ఆసక్తి రేపుతున్న పర్యటన..

ఇటీవలి కాలంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ లో జరిగే సార్క్ సమావేశాల్లో భరత్ పాల్గొంటుందా లేదా అనే అనుమాలున్నాయి. అయితే భారత్ తరపున హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సార్క్ సమావేశాల్లో పాల్గొంటారు. ఈ మేరకు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన ఖరారు అయ్యింది. ఆగష్టు 3,4వ తేదిల్లో జరిగే సార్క్ సమావేశాలకు రాజ్ నాథ్ హాజరు కానున్నారు. ఉగ్రవాద సంస్థ హిబ్జుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ ను భద్రతా దళాలు మట్టు బెట్టడంతో కాశ్మీర్ లోయలో అల్లర్లు చెలరేగాయి. ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సహా పాకిస్తాన్ నేతలు బుర్హాన్ ను స్వాతంత్ర సమర యోధుడితో పోల్చారు. దాంతో భారత్ తీవ్రంగా స్పందించింది. రెండు దేశాల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన తీవ్ర ఆసక్తిని రేపుతుంది.

Leave a Reply