దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

కొంతమంది పబ్లిసిటీ కోసమైనా గాని, మోసం చేయటానికైనా గాని ఎంతవరకైనా తెగిస్తారు అనేందుకు ఇదొక ఉదాహరణ. ప్రధాని నరేంద్ర మోదీ పేరును, ఫొటోను ఉపయోగించి ఒక వ్యక్తి ఏకంగా కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్‌పీఎఫ్) ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. సీఆర్‌పీఎఫ్ ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ అప్లికేషనుకు ఈ దరఖాస్తును పంపించాడు. ఈ పని చేసిన వ్యక్తి ఆచూకీ కోసం దర్యాప్తు జరుపుతున్నారు. ఆన్‌ లైన్ లో చేసిన దరఖాస్తులో అభ్యర్థి పేరును నరేంద్ర మోదీ అని, ఫొటో స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను అతికించాడు. దీనిపై ఢిల్లీ పోలీసులకు సీఆర్‌పీఎఫ్ ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్, ఐటీ యాక్ట్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి  ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply