తర్వాతి స్థానాలలో బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగులు…

భారత దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన 928 మంది ఉద్యోగులను అవినీతికి పాల్పడినందుకు తొలగించారు. వారిలో 60 శాతం మంది బ్యాంకు మేనేజర్ లు ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉండడం గమనార్హం. అలాగే దేశంలో 19000 మంది అధికారులపై స్వల్ప స్థాయిలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో వారికి జరిమానాలు, హెచ్చరికలు, జీతాల్లో కోత వంటివి విధించారు. మరో 3600 మంది ఉన్నత అధికారులకు చిత్తశుద్ధితో పనిచేయని కారణంగా జరిమానా విధించారు. దేశం మొత్తం మీద రైల్వే ఉద్యోగులు అవినీతిలో మొదటి స్థానంలో నిలిచారు. 12,394 మంది రైల్వే ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. రైల్వేల తర్వాతి స్థానంలో బ్యాంకులు నిలిచాయి. 5363 మంది బ్యాంకు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. 3079 మంది పట్టణాభివృద్ధి శాఖకు చెందిన అధికారులపై, 3379 టెలికాం అధికారులపై, 4986 మంది ఆర్ధిక శాఖ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

Leave a Reply