కేవలం ఓట్ల కోసమేనా..?

ఉత్తర ప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. అందుకోసం అన్ని పార్టీలు తమ సర్వ శక్తులు ఒడ్డి పోరాడటానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చావో రేవో అన్నంతగా పోరాడుతుంది. ఎన్నికల వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంది. ఆయన గతంలో మోడీ ప్రధాని అవ్వడానికి, బీహార్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవ్వడానికి వ్యూహ కర్తగా పని చేశారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. అందుకోసం ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువగా ఉన్న అగ్ర వర్ణాల ఓట్లను ఆకర్షించే విధంగా ఆయన వ్యూహాలు సాగుతున్నాయి. ఇప్పటికే అగ్ర వర్ణాలకు చెందినా షీలా దీక్షిత్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అగ్రవర్ణాలలోని పేద వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది. అలాగే తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చబోతున్నట్లు సమాచారం.

Leave a Reply