ముదిరిన మల్లన్న సాగర్ వివాదం..

మల్లన్న సాగర్ పై రోజు రోజుకు అదికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముదుతుంది. తెలంగాణ ప్రతిపక్ష నేత జానా రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుపై మండిపడ్డారు.హరీష్ రావు ప్రతిపక్షాలు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు అని ఆరోపించడం ఎంతమాత్రం సరికాదన్నారు. మల్లన్న సాగర్ కోసం భూములను మార్కెట్ ధర కంటే తక్కువగా తీసుకుంటే ఊరుకునేది లేదని, రైతులకు న్యాయం చేస్తే తాము ఇబ్బంది పెట్టబోమని, భాదితులకు తాము అండగా ఉంటామని జానారెడ్డి పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు చేసి మంత్రి హరీష్ రావు తప్పు చేశారని, వెంటనే ఆయన తను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తే రైతులకు నష్టం అనే వాదన చేయడం హరీష్ రావుకు సరి కాదన్నారు.

Leave a Reply