ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మీడియా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న భూతో న భవిష్యత్ అనే విధంగా నిర్మింపతలపెట్టిన రాజధాని నగరం అవరావతి పేరు ఇప్పుడు దేశ విదేశాల్లో మారు మోగిపోతుంది. అనేక దేశాలనుండి పెట్టుబడులు పెడతామంటూ వ్యాపారవేత్తలు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు భారతదేశం మొత్తం ఈ నగరం చర్చించుకుంటుంది. అమరావతి నగరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే కాదు, దేశానికి కుడా ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే మన దాయాది దేశం, మనల్ని ఎప్పుడు ద్వేషిస్తూ ఉండే పాకిస్తాన్ మాత్రం అమరావతిపై విషం చిమ్మడం ప్రారంభించింది. అక్కడి మీడియాలో అణు బాంబుల తయారీ కోసం భారతదేశంలో నగరాన్ని నిర్మిస్తున్నారని, హైడ్రోజన్ అణు బాంబును అమెరికా సహాయంతో అమరావతిలో తయారు చేస్తునారు అని వార్తలు వస్తున్నాయి. భారత దేశాన్ని అపతిష్ట పాలు చేసేందుకు పాకిస్తాన్ ఎంత నీచానికైనా దిగజారుతుంది అనేందుకు అక్కడ వస్తున్న వార్తలే ఉదాహరణ.

 

Leave a Reply