భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు..

నిత్యం కవ్విస్తూ ఉండే పాకిస్తాన్ కు భారత దేశం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఉగ్రవాది బుర్హాన్ అమరవీరుడంటూ పేర్కొంటూ, స్వాతంత్ర ఉద్యమంలో మరణించిన వీరుడంటూ జూలై 19న బ్లాక్ డే జరపాలంటూ పాకిస్తాన్ కేబినేట్ నిర్ణయం తీసుకోవడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశంలో పొలిటికల్ గా మైలేజ్ పెంచుకోవడానికి, కాశ్మీర్ అంశాన్ని వాడుకోవడాన్నిభారత్ తీవ్రంగా ఆక్షేపించింది. తమ వ్యవహారాల్లో తల దూర్చడానికి పాకిస్తాన్ కే కాదు ఏ దేశానికి హక్కు లేదంటూ భారత్ స్పష్టం చేసింది. త్వరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడి వారిని ఆకట్టుకోవడానికి పాకిస్తాన్ ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుందని భారత్ ఆరోపించింది.

Leave a Reply