పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఎందుకోసం..?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో బహిరంగసభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్ర కథానాయకుల అభిమానుల మధ్య జరిగిన గొడవల్లో వినోద్ రాయల్ అనే పవన్ కళ్యాణ్ అభిమాని మరణించిన సంగతి తెలిసిందే. వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి చేరుకున్న పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఏర్పట్లు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో రాజకీయ శూన్యత ఆవహించి ఉంది. అక్కడి ప్రజలు ఏ రాజకీయ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ఇటువంటి సమయంలో బహిరంగ సభ పెడుతున్న పవన్ కళ్యాణ్ గనుక ప్రజా సమస్యలపై గట్టిగా స్పందించి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు. కాని పవన్ ప్రజా సమస్యలపై స్పందిస్తారా అనేది అనుమానంగా మారింది. అలాగే అభిమానుల మధ్య జరుగుతున్న గోడవలపై కూడా పవన్ తన స్పందనను తెలియజేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

Leave a Reply