కనీసం బతిమాలటం కుడా చేయట్లేదు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరీపై అన్ని పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా గత ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గత ఎన్నికల ముందు ప్రశ్నిస్తానంటు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రశ్నించక పోయినా కనీసం బతిమాలడం కూడా చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించకపోతే చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా ప్రత్యేక హోదా గురుంచి మాట్లాడుతున్నారు అని, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ చేస్తున్న బంద్ కు తెలుగు దేశం, జనసేన పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply