కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తమ కుమార్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన పై తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లాలోని కోదాడలో సోమవారం ఆయన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాగార్జున సాగర్ ఎండిపోయిందని విమర్శించారు. అలాగే మిషన్ కాకతీయ అని చెరువులను కూడా ఎండబెట్టారన్నారు. ఇందిరమ్మ ఇళ్లనే ఇవ్వడం లేదు, కానీ డబుల్ బెడ్రూం పథకం పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు అని ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొని ఇప్పటి వరకు ఆ విషయం మాటాడలేదన్నారు. ఈ రెండెళ్లలో ప్రభుత్వం వల్ల ఏదైనా మేలు జరిగి ఉంటే అది కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే అని ఆరోపించారు.

Leave a Reply